ఎంపీ మురళీమోహన్ సంచలన నిర్ణయం!
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రెండ్రోజుల క్రితమే ఆయన ఈ నిర్ణయానికి వచ్చారని, ఆయన కోడలు రూప కూడా పోటీ చేయకూడదని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాను ఏర్పాటు చేసిన ట్రస్టు కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. అమరావతిలో రాజమహేంద్రవరం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానం అభ్యర్థులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించనున్నారు. మురళీమోహన్ కూడా హాజరు కానున్నారు. ఆ సందర్భంగా తన నిర్ణయాన్ని ముఖ్యమంత్రికి స్వయంగా తెలియజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.













