కేసీఆర్ ప్రచారం చేస్తే టీడీపీకి 160 సీట్లు ఖాయం: ఎంపీ నాని
మోదీపై దేశ ప్రజలు ఎప్పుడో నమ్మకం కోల్పోయారని ఎంపీ కేశినేని నాని అన్నారు. బుధవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ దేశంలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్, అనుకూల ఫ్రంట్ మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఓ కిచిడీ ఫ్రంట్ అని వ్యాఖ్యానించారు.ఫెడరల్ ఫ్రంట్ తరపున జగన్‌తో చర్చలు నిష్ప్రయోజనమన్నారు. ఏపీలో టీడీపీకి 130 సీట్లు రావడం ఖాయమని… అయితే జగన్ తరపున కేసీఆర్ ప్రచారం చేస్తే టీడీపీకి 160 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీకి 130 సీట్లకు మించి రావని ఆయన అన్నారు. మోదీకి మద్దతిచ్చేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అని మండిపడ్డారు. కేసీఆర్ ద్వారా జగన్.. మోదీకి మద్దతివ్వబోతున్నారని ఫెడరల్ ఫ్రంట్ పేరిట భేటీ అందులో భాగమే అని అన్నారు. వీరివురూ కలిసి ఏపీ రాజకీయాల్లోకి వస్తే టీడీపీ స్వాగతిస్తోందని ఎంపీ కేశినేని నాని తెలిపారు.













