మోడీ జగన్ సర్కార్ పై ఎటువంటి కామెంట్స్ చేస్తారో?
ఎన్నాళ్ళ నుంచో ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్న అరుదైన దృశ్యం ఈనెల 17న తెరమీదకు రాబోతోంది. ఒకే వేదికపై అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో నరేంద్రనాథ్ మోడీ కూడా కనిపించనున్నారు. చిలకలూరిపేట జరిగే సభలో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతోంది. నిజానికి ఈ సభకు సంబంధించిన డేట్ ఎప్పుడో ఫిక్స్ అయింది. అయితే అంతకుముందు బీజేపీ పొత్తుపై స్పష్టత లేదు కాబట్టి ఈ సభలో కేవలం చంద్రబాబు, పవన్ మాత్రమే పాల్గొంటారు అని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు బీజేపీతో పొత్తు కన్ఫర్మ్ అవ్వడం తో ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తారని చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో చెప్పినట్లు టాక్. అంటే మరో వారం వ్యవధిలో ఏపీ ఎన్నికల ప్రచారం లో ప్రధాని మోదీ పాల్గొంటారు అన్న మాట. అప్పటికే ఎన్నికలు షెడ్యూల్ కూడా విడుదల చేస్తారు కాబట్టి.. జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా మోడీ మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఆ మధ్య విశాఖకు విచ్చేసిన అమిత్ షా జగన్ సర్కార్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో మోడీ జగన్ పై ఎటువంటి కామెంట్స్ చేస్తారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది.













