వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. వారికి ఏపీ కనిపిస్తుందా?
టాలీవుడ్‌ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. అసలు సినిమా వారికి ఏపీ అంటే గుర్తుందా? అని ప్రశ్నించారు. టిక్కెట్ రేట్లు తగ్గిస్తే సామాన్యులు కూడా సినిమాలు చూస్తారని, ప్రభుత్వ నిర్ణయంలో తప్పేంటని ఆయన సమర్థించుకున్నారు. సినిమా వాళ్లంతా హైరదాబాద్‌లో ఉన్నారని, వారికి ఏపీ కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. కేవలం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన ఇమేజ్ పెంచుకోవడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.













