Quantum Valley: గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా అమరావతి
భారత తొలి క్వాంటమ్ ఎకో సిస్టమ్‌కు అమరావతి (Amaravati)లో శంకుస్థాపన ఓ చారిత్రక ఘట్టమని మంత్రులు అచ్చెన్నాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు ప్రశంసించారు. దేశ భవిష్యత్తును ముందే ఊహించే దూరదష్టి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అని కొనియాడారు. అమరావతిని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడుతోందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇది కీలక మైలురాయి అని, అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్‌గా రూపాంతరం చెందుతుందని అన్నారు. నవ్యాంధ్ర యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలు, అవకాశాలు భవిష్యత్తు టెక్నాలజీలకు కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి వేస్తున్న పునాది, రేపటి భారత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే అడుగని అన్నారు. గ్లోబల్ టెక్నాలజీలో సరికొత్త విప్లవం అమరావతి క్వాంటమ్ వ్యాలీ (Quantum Valley) అని పేర్కొన్నారు. భవిష్యత్తులో నవ్యాంధ్ర (Navyandhra) ఆర్థిక వ్యవస్థకు బలమైన వెన్నెముకగా ఇది మారనుందని మంత్రులు వెల్లడించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});













