ఆ హక్కు సీఎస్ కు లేదు
మంత్రి మండలి నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (సీఎస్) లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సృష్టం చేశారు. అప్పులు, వడ్డీ రేట్లపై ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు. మంత్రిమండలికి సీఎస్ సబార్డినేటర్ మాత్రమే. ఆయన సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అని ధ్వజమెత్తారు. ఈ మేరకు యనమల ఒక ప్రతికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నిర్వహణ ఆర్థికశాఖ బాధ్యత. బడ్జెట్ ఆమోదాన్ని బట్టి నిధులను కేటాయిస్తుంది. ప్రాధాన్యం ప్రకారం నిధుల విడుదల ఉంటుంది. ఉద్యోగుల సంక్షేమం, పేదల సంక్షేమానికి అనుగుణంగా నిధులిస్తుంది. రాబడి, అప్పుల మధ్య సమతుల్యతతో నిధుల నిర్వహణ ముడిపడి ఉంటుందని అని వివరించారు. రోజువారీ అవసరాలపై సమీక్షించే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని, ప్రజా ప్రభుత్వంలో జరిపే సమీక్షలకు అధికారులు హాజరుకావడం నిత్యకృత్యమేనని అభిప్రాయపడ్డారు.













