Ramanaidu: జగన్ పాలనలో అన్ని రంగాలూ దోపిడీ : మంత్రి నిమ్మల
వైఎస్ జగన్ (YS Jagan) పాలనలో అన్ని రంగాలూ దోపిడికి గురయ్యాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) ఆరోపించారు. పాలకొల్లు మండలంలో మన రైతు -మన రామానాయుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రూ.కోటి విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గతంలో డిస్ట్రిబ్యూటరీల నుంచి మద్యం షాపు (Liquor shops )ల వరకు జగనే పెట్టుకున్నారని విమర్శించారు. లిక్కర్, శాండ్ మైన్స్, భూములు దోపిడీపైనే జగన్ దృష్టి పెట్టారన్నారు. వైసీపీ(YCP) హయాంలో జరిగినంత లిక్కర్ లూటీ మరెక్కడా జరగలేదు. తెలంగాణ (Telangana)లో డిస్టిలరీ స్కామ్‌తో పోలిస్తే జగన్ లిక్కర్ స్కామ్ ఎవరెస్టును తాకుతుంది అని విమర్శించారు.













