Narayana: రాజధాని గ్రామాల్లోని పనులన్నీ 6 నెలల్లో పూర్తిచేస్తాం : మంత్రి నారాయణ
రాజధాని పరిధి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే పనులను ముమ్మరం చేసినట్లు మంత్రి నారాయణ (Narayana) తెలిపారు. వడ్డమానులో రహదారిని ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రూ.900 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు డీపీఆర్ (DPR) సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందని, వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామన్నారు. 6 నెలల్లో గ్రామాల్లోని పనులన్నీ పూర్తిచేస్తామని వివరించారు. రాజధానిని గుంటూరు, విజయవాడ సహా పలు ప్రాంతాలకు అనుసంధానించే రోడ్డు పనులు ముమ్మరంగా చేస్తున్నట్లు తెలిపారు. వెస్ట్ బైపాస్‌ను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. కరకట్టకు సమాంతరంగా సీఆర్డీఏ (CRDA) రోడ్డును మంగళగిరి రోడ్డుకు అనుసంధానిస్తామన్నారు. దేశానికి మాజీ ప్రధాని వాజ్‌పేయీ (Vajpayee) చేసిన అపూర్వ సేవలను స్మరించుకుంటూ రాజధానిలో ఆయన విగ్రహాన్ని ఈ నెల 25న ఆవిష్కరిస్తామని చెప్పారు.






