Nara Lokesh:ఇస్కాన్ ఆలయంలో మోదీ కోసం.. మంత్రి లోకేశ్ ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పుట్టినరోజు సందర్భంగా లండన్ (London) పర్యాటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఇస్కాన్ ఆలయం (ISKCON Temple) లో మోదీ పేరు మీద ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. మోదీ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. మోదీ దార్శనిక పాలన దేశానికి అవసరం. ఆయన మార్గదర్శకత్వంలో వికసిత్ భారత్ సుసాధ్యం కానుంది అని పేర్కొన్నారు.