Nara Lokesh: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో నారా లోకేశ్ భేటీ
ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణ్మాతక సంస్కరణలు తీసుకొస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan)కి వివరించారు. ఢల్లీి పర్యటన లో భాగంగా కేంద్రమంత్రి ధరేంద్ర ప్రధాన్‌తో నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా ప్రమాణాలు మెరుగుదలకు చేపడుతున్న సంస్కరణల ను కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. లెర్నింగ్ అవుట్ కమ్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాం. ఇందులో భాగంగా ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాప్రమాణాల మెరుగుదలకు 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసి వన్ క్లాస్ వన్ టీచర్ విధాన్ని అమలు చేస్తున్నాం. అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాని (Assembly constituency) కి ఒకటి చొప్పున 175 లీప్ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. 700 యూపీ స్కూళ్లను హైస్కూళ్లుగా అప్ గ్రేడ్ చేశాం. అకడమిక్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇస్తున్నాం. ఎలాంటి రాజకీయం జోక్యం లేకుండా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ (Teacher Transfer Act ) తెచ్చి సీనియారిటీ ప్రాతిపదికన ఉపాధ్యాయుల పదోన్నతలు, బదిలీలను విజయవంతంగా పూర్తి చేశామన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో 125 ఆటిజం స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములుగా చేసేందుకు జులై 5న రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ నిర్వహిస్తున్నాం. విద్యార్థుల పనితీరును వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజేస్తు న్నాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో స్కూలు మేనేజ్మెంట్ కమిటీలను భాగస్వాములను చేస్తున్నాం. విద్యారంగ అభివృద్ధికి సలహాల కోసం ప్రతివారం టీచర్స్ యూనియన్లు, ఉత్తమ ఉపాధ్యాయు లతో సమావేశమవుతున్నాం అని లోకేశ్ వివరించారు. జూలై 5న జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ (Mega Parents Teachers Meet) కార్యక్రమానికి హాజరుకావాలని ధరేంద్ర ప్రధాన్‌ను ఆహ్వానించారు. ఆగస్టులో విద్యాశాఖ మంత్రుల కాంక్లేవ్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌కు అవకావశం ఇవ్వాలని లోకేశ్ కోరగా అందుకు ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు.













