Modi: ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి : మంత్రి లోకేశ్

కర్నూలులో ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొనే సూపర్ జీఎస్టీ (GST) సూపర్ హిట్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రధాని రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ దీపావళి (Diwali) సందర్భంగా ఈ నెల 16 నుంచి 19 వరకు జిల్లా కేంద్రాల్లో గ్రాండ్ జీఎస్టీ షాపింగ్ ఫెస్టివల్స్ నిర్వహించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు చేకూరే మేలును వివరిస్తూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 98,985 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు మంత్రుల బృందానికి అధికారులు వివరించారు. విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు, ఆసుపత్రుల్లో 22,500 అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.