Minister Lokesh: రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Lokesh) నెరవేర్చారు. తాడేపల్లి పట్టణం సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ (Retaining wall) నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. కృష్ణా నది (Krishna River) కి ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) దిగువన కుడి వైపు 0.900 కి.మీ. నుంచి 2.160 కి.మీ వరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.294.20 కోట్లతో పనులు చేపట్టేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఇటీవల ఆమోదం తెలిపింది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








