Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్.. దశాబ్దాల కలకు సాకారం…
ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చారు. తాడేపల్లి పట్టణం సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. రూ.294.20 కోట్లతో కృష్ణా నదికి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భారీ వరదల్ని సైతం తట్టుకునేలా ఈ వాల్‌ను నిర్మిస్తున్నారు. ఏడాది కాలంలోనే పరిపాలన అనుమతులు రాగా.. టెండర్లు కూడా పూర్తయ్యాయి.. త్వరలో పనులు ప్రారంభించనున్నారు. రిటైనింగ్ వాల్‌ను భవిష్యత్‌లో కృష్ణానదికి భారీ వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా నిర్మిస్తారు. కృష్ణా నదిలో 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా రిటైనింగ్ వాల్‌ను ప్లాన్ చేశారు.
ఇవి కూడా చదవండి
ప్రకాశం బ్యారేజీ దిగువన 0.9 కి.మీ నుంచి 2.610 కి.మీ వరకు కృష్ణా నది కుడివైపు వరద రక్షణ గోడను నిర్మించనున్నారు. ఈ రిటైనింగ్ వాల్‌ను కేవలం మామూలు గోడగా నిర్మించడం లేదు.. అక్కడ భూమి లోపల 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1,920 పైల్స్ వేసి.. పైల్- రాఫ్ట్ సాంకేతికతతో నిర్మిస్తారు. నీళ్ల ఉధృతితో పాటుగా భూకంపాలను సైతం తట్టుకునెలా ఈ గోడను నిర్మించనున్నారు. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తైతే తాడేపల్లి సమీపంలోని సుందరయ్య నగర్, మహానాడు కాలనీతో పాటూ పలు లోతట్టు ప్రాంతాలవారికి మేలు జరుగుతుందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి








