వాస్తవాలు చెబితే దాడులా?
వైకాపా నేతలు బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పసుపు-కుంకుమ పథకం డబ్బులు మహిళలకు అందకుండా చేయడానికి కుట్రలు పన్నారని మండిపడ్డారు. వైకాపా నేత విజయసాయిరెడ్డి దుర్మార్గమైన భాష మాట్లాడుతున్నారని అన్నారు. అవినీతి కేసుల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడే తీరును ప్రజలు గమనిస్తున్నారని, వారు బెయిల్పై బయటకి వచ్చి ఆర్థిక ఉగ్రవాదులుగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల ముందుకు వచ్చి వస్తావాలు చెబుతున్న వారిపై దాడులు చేస్తున్నారని తెలిపారు. దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈవీఎంలో లోపాలున్నాయని మాట్లాడుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు పన్నుతుంటే.. ఆయనతోనే వైకాపా అధినేత జగన్ చేతులు కలిపారని ఆరోపించారు.













