జనవరిలో పెట్టుబడిదారుల సదస్సు : మంత్రి ముత్తంశెట్టి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి, విస్తరణకోసం పెట్టుబడిదారుల సమావేశం జనవరిలో విశాఖపట్నంలో లేదా విజయవాడలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు తెలిపారు. పర్యాటక, క్రీడా శాఖల అధికారులతో సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 13 ప్రాంతాల్లో ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏడు, ఐదు నక్షత్రాల హోటళ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలిపారు. ఐదు ప్రాంతాల్లో నిర్మించేందుకు బబెరాయ్, హైయత్ గ్రూపులు ముందుకు వచ్చాయని తెలిపారు. జనవరి 12న జాతీయ యూత్ డే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏడాదికి రెండుసార్లు జాతీయ స్థాయి యూత్ ఫెస్టివల్స్ నిర్వహించాలని తెలిపారు.













