2022కు దేశంలోనే ఏపీ నంబర్ వన్
భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ 2022 నాటికి ప్రథమ స్థానంలో ఉంటుందని మంత్రి అమరనాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె ఆర్అండ్బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ దేశమైన ఇటలీ రిపబ్లిక్ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించి అన్యాయం చేశారన్నారు. ఆస్థులు తెలంగాణకు, అప్పులు ఆంధ్రప్రదేశ్‌కు మిగిలాయన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికి ఏ అభివృద్ధి పథకాన్ని నిలపకుండా కొనసాగిస్తున్నారన్నారు. 40 శాతం కుటుంబాకు పించన్లు అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందన్నారు. ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయడం వల్ల 30 శాతం విద్యుత్ ఆదా అయ్యిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ దేశాలు పర్యటించి పెట్టుబడుదారులను ఆహ్వానించడం జరిగిందన్నారు. భారతదేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారన్నారు.













