ఆస్ట్రేలియాతో ఏపీ ఒప్పందాలు : మంత్రి అమర్నాథ్
పరిశ్రమలు, నైపుణ్య శిక్షణ, ఆహార శుద్ధి, విద్యుత్ గనులు, తయారీ రంగాల్లో తోడ్పాటు అందించేలా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి పశ్చిమ ఆస్ట్రేలియా అంగీకరించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. దీనికి సంబంధించి విశాఖలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, పశ్చిమ ఆస్ట్రేయాలు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు. ఈ ఒప్పందం వల్ల పెట్టుబడులను ఆకర్షించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పశ్చిమ ఆస్ట్రేలియా తోడ్పాటును అందిస్తుంది అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు సాంకేతిక సహకారం, నైపుణ్య శిక్షణ అందించడానికి పశ్చిమ ఆస్ట్రేలియా అంగీకరించిందని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వళవన్ తెలిపారు.













