రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం ఆదా
ప్రభుత్వం పై పనిగట్టుకుని అవాస్తవ ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సచివాయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం పెడుతున్నామని, విద్యార్థులకు చిక్కీలు, గుడ్లు అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు చిక్కీలు కోసం రూ.350 కోట్లు ఖర్చు చేశామన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం ఆదా చేశామని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అవినీతికి ఆస్కామే లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఎక్కువ మొత్తంలో చిక్కీలు కొన్నాం. కానీ దానికి కూడా అవినీతి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమాలన్న వారికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.













