జగనన్న సురక్ష కార్యక్రమం.. వారి కోసమే
ప్రజల సమస్యల పరిస్కారం కోసం జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 11 రకాల ధృవప్రతాలను ఇంటింటికి వెళ్లి అందిస్తామని తెలిపారు. సీఎం జగన్ 99.5 శాతం సంక్షేమ ఫలాలు అందించారని, నూటిని నూరు శాతం లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించాలన్నదే జగన్ ఉద్దేశమన్నారు. ప్రజలను జల్లెడ పట్టి వారి సమస్యలను గుర్తించి సిబ్బంది పరిష్కరిస్తారన్నారు. కార్యక్రమం పర్యవేక్షణకు 26 జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారన్నారు. 5 కోట్లకు పైగా ప్రజలకు 1.60 కోట్ల కుటుంబాలను కలిసి సమస్యలను గుర్తిస్తారని, జగన్న సురక్ష కార్యక్రమాన్ని వందకు వంద శాతం విజయవంతం చేయాలని సీఎం ఆదేశించారన్నారు.













