విశాఖ హెచ్పీసీఎల్ లో భారీ అగ్ని ప్రమాదం

విశాఖపట్నంలోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పరిశ్రమలో దట్టమైన పొగలతో మంటలు వ్యాపించాయి. ఈ మంటలను గమనించిన స్థానికులు, అగ్ని ప్రమాదంపై పోలీసులకు సమచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం సంభవించడంతో పరిశ్రమలో సైరన్ మోగించి, ఉద్యోగులందర్నీ బయటికి పంపించేశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 100 మందికి పైగా ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణ హానీ సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సీడీయూ మూడో యూనిట్లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారణాలు మాత్రం తెలియ రాలేదు. ఇంధనం నిల్వచేసే ట్యాంక్ పేలి ఉంటుందేమోనని అనుమానిస్తున్నారు.