Malavika: హాస్పిటల్ డ్రెస్ లో మాళవిక పోస్ట్.. కంగారు పడుతున్న ఫాలోవర్లు
మాళవిక శర్మ(Malavika Sharma) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం పన్లేదు. రవితేజ(Ravi Teja) హీరోగా నేల టికెట్(Nela Ticket), రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా రెడ్(Red), గోపీచంద్(Gopichand) తో కలిసి భీమా(Bheema), సుధీర్ బాబు(Sudheer Babu)తో కలిసి హరోంహర(Harom Hara)చేసిన మాళవిక శర్మ టాలీవుడ్ ఆడియన్స్ కు సుపరిచితురాలే. మాళవిక తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట ఇంట్రెస్టింగ్ గా మారింది.
మామూలుగా సోషల్ మీడియాలో తన రెగ్యులర్ అప్డేట్స్ తో పాటూ హాట్ ఫోటోలు షేర్ చేసే మాళవిక ఇప్పుడు సడెన్ గా హాస్పిటల్ డ్రెస్ లో కనిపించింది. అంతేకాదు, సడెన్ గా హాస్పిటల్ డ్రెస్ లో ఇరుక్కుని పోయి, చుట్టూ రకరకాల పరికరాలుంటే నవ్వడం కాకుండా ఇంకేం చేస్తాం, అయినా ఈ డ్రెస్ లో కూడా క్యూట్ గానే కనిపిస్తున్నా అంటూ మాళవిక షేర్ చేసింది.
అయితే ఈ విషయాన్ని మాళవిక లైట్ తీసుకుని పోస్ట్ చేసినప్పటికీ అసలు విషయం తెలియని ఆమె అభిమానులు, ఫాలోవర్లు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. థ్రిల్ అవడానికి అన్ని అడ్వెంచర్లు చేసే వాళ్లు హాస్పిటల్ అడ్వెంచర్ మాత్రం ఎందురు చేయరని మాళవిక మరో వీడియోను పోస్ట్ చేస్తూ రాసుకొచ్చింది. ఇదంతా పక్కన పెడితే అసలు మాళవిక హాస్పిటల్ కు ఎందుకెళ్లింది? ఏదైనా చెకప్ కోసం వెళ్లిందా లేదా అమ్మడు మరేదైనా సమస్యతో ఇబ్బంది పడుతుందా అనేది తను క్లారిటీ ఇస్తే కానీ తెలియదు.













