లోకేశ్ ఆస్తుల ప్రకటన బూటకం.. నాటకం -మల్లాది విఘ్ణ
ఏపీలో 22 మంది ఎమ్మెల్యేలు కొన్నారు. ఎంఎల్ఏల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేశారు. లోకేశ్ ఆస్తుల్లో వాటిని ఎందుకు చూపించలేదు. లోకేశ్ చట్టాన్ని తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పోలవరంపై ప్రభుత్వంలో తలోమాట మాట్లాడుతున్నారు. శ్రీ వైయస్ జగన్ గురించి లోకేశ్, పవన్ చాలా ఎక్కువ మట్లాడుతున్నారు. వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లోకేశ్ కు లేదు. రాష్ట్రంలో ఫిరాయింపులపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదు. అబద్ధాల దినోత్సవంగా ఈరోజును ప్రకటించాలి. పోలవరం వైయస్ఆర్ స్వప్నం. ఆనాడు పోలవరానికి వ్యతిరేకంగా బాబు ఏం చేశారో రాష్ట్ర ప్రజలకు తెల్సు.
నారా లోకేశ్ ఆస్తుల ప్రకటన సందర్భంగా చేసిన విమర్శలపై వైయస్ఆర్ సీపీ సీనియర్ నేత మల్లాది విఘ్ణు విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాలోకేశ్ కి పెట్టుబడులు, దిగుబడులకు మధ్య తేడా తెలీదని ఎద్దేవా చేశారు. శ్రీ వైయస్ జగన్ గారి కంపెనీల్లో పెట్టుబడులపై కేసులు నమోదు అయ్యాయని వాటిపై కోర్టుల్లో విచారణ జరుగుతోందన్నారు. అవినీతి అంటూ మాట్లాడుతున్న లోకేశ్ ఆ కేసులు నమోదు ఎలా అయ్యాయో తెల్సుకోవాలని హితవు పలికారు. టీడీపీ పాలనలో రాష్ట్రంలో మట్టి దగ్గర నుంచి భూముల వరకు జరుగుతున్న అవినీతిపై వైయస్ఆర్ సీపీ పుస్తకం ప్రచురించిందని దానిపై దర్యాప్తుకు సిద్ధమేనా అని ఆయన సవాల్ విసిరారు. దీనిపై సచ్ఛీలత నిరూపించుకోవాటానికి దర్యాప్తు ఆదేశించుకోవచ్చు కదా అని మల్లాది విఘ్ణ ప్రశ్నించారు. గతంలో వైయస్ఆర్ హయాంలో వచ్చిన ప్రతి ఆరోపణలపై ఆయన సీబీఐ ఎంక్వైరీ ఆదేశించిన సంగతి ఈ సందర్భంగా మల్లాది గుర్తు చేశారు. గతంలో లోకేశ్ ప్రకటించిన ఆస్తులు వచ్చేకొద్దీ తగ్గిపోయాయని మల్లాది ఆశ్చర్యం వ్యక్తం చేశఆరు. మీకు రెట్టింపు డబ్బులు ఇస్తామని వైయస్ఆర్ సీపీ ఎంపీ మిధున్ రెడ్డి సవాల్ స్వీకరిస్తారో లేదో.. మీడియా సమావేశం పెట్టి చెప్పండని మల్లాది విఘ్ణ డిమాండ్ చేశారు. ఈ ఆస్తుల ప్రకటన బూటకమని మల్లాది మండిపడ్డారు. పోలవరంపై బాబు ప్రకటన అంతా అబద్ధమన్నారు. వైయస్ఆర్ హయాంలోనే పోలవరం పనులు మొదలు అయ్యాయి. పోలవరం ప్రాజెక్టుకు నేను ఆదిపురుషుడు అని చంద్రబాబు ప్రకటించుకోవటంపై మల్లాది మండిపడ్డారు. జలవనరుల శాఖా మంత్రేమో 2018 నాటికి పూర్తవుతుందని చెప్పటం.. ముఖ్యమంత్రి ప్రకటనకు పొంతన లేకపోవటం వారి మధ్య ఎంత సమన్వయం ఉందో తెలుస్తోందని మల్లాది ఎద్దేవా చేశారు. వైయస్ఆర్ హయాంపై శ్వేత పత్రాలు ప్రకటించారని మరి పోలవరంపై శ్వేతపత్రం ప్రకటించమని ప్రతిపక్షం కోరితే వైయస్ఆర్ సీపీపై బురదజల్లాలని చూడటంపై ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించి మల్లాది విఘ్ణ. మీరు (టీడీపీ) మంచి, శ్రీజగన్ చెడు అనే విధంగా ప్రయత్నించటం ఇది పూర్తిగా అవాస్తవమని మల్లాది విఘ్ణ స్పష్టం చేశారు. ఈ రోజును అబద్ధాల దినోత్సవంగా జరపవచ్చు అని మల్లాది అన్నారు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. లోకేశ్ కు శ్రీ వైయస్ జగన్ గారిపై మాట్లాడే అర్హత లేదన్న మల్లాది. నవరత్న నటనా సార్వభౌముడు ఎన్టీఆర్ కాదు.. లోకేశ్ అని ఎద్దేవా చేసిన మల్లాది. శ్రీ జగన్ గారిపై మాట్లాడే స్థాయి లోకేశ్ కి లేదని స్పష్టం చేసిన మల్లాది.
పవన్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్..
వైయస్ జగన్ గారిపై పవన్ విమర్శలు చేయటంపై మల్లాది స్పందిస్తూ.. రాష్ట్రంలో ఫిరాయింపులపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు చేయటం తప్పు అంటూనే ఆయన్నే సమర్థించే ప్రయత్నం చేయటం ద్వారా పవన్ వైఖరి బయటపడిందన్నారు.













