నంద్యాల అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి మల్కిరెడ్డి రాజగోపాల్రెడ్డి బరిలో దిగుతారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రకటన చేశారు. నంద్యాల నియోజకవర్గ ప్లీనరీ ఆదివారం మున్సిపల్ టౌన్ హాల్లో జరిగింది. సమావేశంలో ప్రసంగించిన కాటసాని అనూహ్యంగా వైసీపీ అభ్యర్థిని ప్రకటించడం చర్చనీయాంశమైంది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా భూమా వర్గం తరపున రేసులో ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డికి కాటసాని స్వయాన మామ. ఆయన ఈ ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం తామంతా పని చేస్తామని కాటసాని రామిరెడ్డి సృష్టం చేశారు. దీంతో ఉప ఎన్నికల రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుంతో అన్న చర్చ మొదలైంది. మరో విషయం ఏమిటంటే ఉప ఎన్నిక ఏకగ్రీవం కావడానికి భూమా, కాటసాని వర్గాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.













