Ramakrishna : సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు : రామకృష్ణ
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9న చేపట్టిన సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు (Left Parties) మద్దతు తెలుపుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ (Ramakrishna) తెలిపారు. విజయవాడలో 10 వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ సోలార్ విద్యుత్ (Solar electricity ) పరిశ్రమల కోసం ఉలవపాడు వద్ద చేపట్టిన బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు చేపట్టిన నిరసనకు వామపక్ష పార్టీలు సంఫీుభావం ప్రకటించాయన్నారు. జులై 2న ఆ గ్రామాల్లో పర్యటించి వారికి మద్దతుగా ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటామని చెప్పారు. ప్రజలపై భారం పడే అదానీ (Adani) తో సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను నిలిపివేయాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ఇండోసోల్, గ్రీన్ కో కంపెనీలు జగన్ (Jagan) బినామీలని ఆరోపించారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీలకే భూమలు కట్టబెట్టాలని చూడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.













