Laya: అందుకే తమ్ముడు సినిమాకు సైన్ చేశా
స్వయంవరం(swayamvaram) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన లయ(laya) ఆ సినిమాతో మంచి హిట్ అందుకుని తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఆ హిట్ తో వరుస పెట్టి సౌత్ హీరోలతో సినిమాలు చేసిన లయ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లి సెటిలైంది. ఇప్పుడు మళ్లీ లయ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. అందులో భాగంగానే నితిన్(nithin) హీరోగా వస్తోన్న తమ్ముడు(thammudu) సినిమాలో నటిస్తోంది లయ.
వేణు శ్రీ రామ్(Venu Sri Ram) దర్శకత్వంలో వస్తోన్న తమ్ముడు సినిమాలో నితిన్ కు అక్క పాత్రలో లయ కనిపించనుంది. తమ్ముడు మూవీలో లయ చాలా కీలక పాత్రలో కనిపించనుంది. జులై 4న ఈ సినిమా రిలీజ్ కానుండగా ప్రమోషన్స్ లో భాగంగా లయ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని సినిమా గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటుంది. అదే సందర్భంగా లయ తాను ఈ సినిమా ద్వారా ఎందుకు రీ ఎంట్రీ ఇస్తుందనే విషయాన్ని కూడా ఆమె వెల్లడించింది.
తమ్ముడు నిర్మాత దిల్ రాజు(Dil raju) ఇన్వాల్వ్మెంట్ మరియు తమ్ముడు కథలోని బలం వల్లే తాను ఈ సినిమాకు సైన్ చేసినట్టు లయ వెల్లడించింది. తమ్ముడు సినిమాలో తన పాత్ర ఆమెనెంతో ఎగ్జైట్ అయ్యేలా చేసిందని, ఆ క్యారెక్టర్ కు ఎంతో భావోద్వేగం మరియు యాక్టింగ్ చేసే స్కోప్ ఉందని, ఇన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న తాను తిరిగి ఇలాంటి బ్యానర్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం తనకెంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొంది.













