టీటీడీ జేఈవోగా లక్ష్మీకాంతం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ స్థాయిల్లో పని చేస్తున్న 12 మంది ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంను తిరుమల తిరుపతి దేవస్థానం(తిరుపతి) జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బదిలీ చేసింది. అక్కడ ఉన్న పోల భాస్కర్‌ను సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌గా నియమించింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా ఎం. రామారావును నియమించి, అక్కడ ఉన్న ధనుంజయ్‌రెడ్డికి ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు అప్పగించింది. ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీనరసింహాన్ని చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగా బదిలీచేసంది. అక్కడ ఉన్న శ్రీనివాస శ్రీనరేష్‌ను గనులశాఖ కార్యదర్శిగా నియమించింది. అక్కడ పనిచేస్తున్న శ్రీధర్‌కు పశుసంవర్థకశాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకూ పర్యాటకశాఖ కార్యదర్శిగా ఉన్న ముఖేష్ కుమార్ మీనాను ఎక్సైజ్ కమిషనర్‌గా నియమించింది.
పర్యాటకశాఖ కార్యదర్శిగా కూడా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. టూరిజం డైరెక్టర్ హిమాన్షుశుక్లాను గుంటూరు జేసీగా నియమించి… గుంటూరు జేసీగా ఉన్న ఇంతియాజ్‌కు కష్ణా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ కతికా శుక్లాను కష్ణా జాయింట్ కలెక్టర్‌గా నియమించి… అక్కడ పనిచేస్తున్న విజయాకష్ణన్ను సాధారణ పరిపాలనశాఖలో డిప్యూటీ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చింది.













