టీడీపీలో చేరిన కోట్ల సూర్యప్రకాశ్
తెలుగుదేశం పార్టీలో కోట్ల కుటుంబం చేరింది. కర్నూలు జిల్లా కొడమూరు సభలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కోట్ల సుజాతమ్మ, కోట్ల రాఘవేంద్రరెడ్డిలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేఈ కృష్ణమూర్తి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఒకే వేదికపైకి కోట్ల, కేఈ కుటుంబసభ్యులు వచ్చారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యాప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు మహత్తర కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. కర్నూలు జిల్లాలో సాగునీటి సమస్యలు చాలా ఉన్నాయని వాటిని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ రావాలని కోరారు. బీజేపీతో కలిసి పనిచేస్తున్న వైకాపాకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెపాల్పలని అన్నారు. రైతుల కష్టాలు తీర్చే టీడీపీకే అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.













