టీడీపీలోకి కొణతాల?
మాజీ మంత్రి, ఉతరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు తెలిసింది. రెండురోజులుగా ఆయన అనకాపల్లిలోని తన కార్యాలయంలో అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. గురువారం కశింకోట మండల నాయకులతో సమావేశైమనట్టు సమాచారం. కొణతాల వర్గీయుడైన ఒక మాజీ సర్పంచ్ మాత్రం స్థానిక టీడీపీ నాయకులతో సర్దుకుపోలేనని, వైసీపీలోకి వెళతానని చెప్పినట్లు తెలిసింది. మిగిలినవారంతా ఏ పార్టీలో చేరినా వెంట ఉంటామని చెప్పారని, టీడీపీలో చేరాలని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొణతాల రామకృష్ణ అతి త్వరలో టీడీపీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.













