శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వీరబ్రహ్మం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతో పాటు పూజా సామగ్రిని శుద్ధి చసినట్లు ఈవో తెలిపారు. ఆ తరువాత పవిత్ర పరిమళ జలంతో ఆలయాన్ని ప్రోక్షణం చేశారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు మధుసూదన్ యాదవ్, సీవీఎస్వో నరసింహకిశోర్, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్ కుమార్, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌బాబు, పేష్కార్ శ్రీహరి, వీజీవో బాలిరెడ్డి, ఏవీఎస్వో సురేంద్ర బాబు పాల్గొన్నారు.













