Liquor Case: ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్ మద్యం కేసు (Liquor Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి (Raj K.C. Reddy) ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమంగా సంపాదించిన డబ్బును వైట్ మనీ (White Money )గా మార్చుకునేందుకు కెసిరెడ్డి వివిధ కంపెనీల్లో (companies) పెట్టుబడులు పెట్టినట్లు నిర్ధరించింది. రాజ్ కెసిరెడ్డి రూ.13 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. బంధువుల పేర్లతోనూ ఆస్తులు కొన్నట్లు గుర్తించారు.