టీటీడీ కీలక నిర్ణయం…
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల అన్నమయ్య భవన్లో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా రెండేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆర్జిత సేవల టికెట్ల ధరలు కూడా పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్జిత సేవల ధరలు పాతికేళ్ల క్రితం నిర్ణయించారని టీటీడీ అదనపు ఈవో వెల్లడించారు. సుప్రభాతం, తోమాల, అర్చన, కల్యాణోత్సవ టికెట్ల ధర పెంపుపై సమవేశంలో చర్చ జరిగిందని అన్నారు.













