AP Cabinet : ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశం (cabinet meeting ) ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ (SC classification) ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ (Assembly), రూ.786 కోట్లతో హైకోర్టు (High Court )భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపిది. నిర్మాణ పనులను ఎల్1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహరణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
విశాఖలోని ఐటీహిల్-3 పైన టీసీఎస్కి 21.66 ఎకరాలు ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం.
ఉరుస క్లస్టర్‌కు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయింపు.
బలిమెల, జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్ కాన్సర్టియమ్కు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం.
30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదం.
వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్లాట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.













