తమ్ముడి పై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..
విజయవాడ లోకె సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని నాని తన సోదరుడు, టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని పై తీవ్ర విమర్శలు చేశారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని.. కానీ కేశినేని చిన్నికి మాత్రం క్రిమినల్ చరిత్ర ఉన్న టిడిపి టికెట్ ఇచ్చిందని విమర్శించారు. విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టే అతని గురించిన వివరాలు వెల్లడించాల్సి వచ్చిందని నాని అన్నారు. కేశినేని చిన్ని.. చార్లెస్ శోభరాజ్ ను మించిన ఘనుడు అని కేశినేని నాని విమర్శించారు. అంతేకాదు తన తమ్ముడితో అతను పాతికేళ్ళ కిందటే విడిపోయినట్లు స్పష్టం చేశారు. గతంలో అతను చాలాసార్లు అప్పులపాలయ్యానని చెప్పి మోసం చేశాడని.. పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేక పోతున్నాను.. బాడుగలు కూడా చెల్లించలేకపోతున్నాను అంటే ఎన్నోసార్లు సహాయం చేశారని కేశినేని నాని వెల్లడించారు. అతని మాటలాగే చేసే వ్యాపారాలు కూడా అన్ని మోసపూరితమైన కేశినేని నాని పేర్కొన్నారు. గతంలో అతని తన వాహనాలకు 5555 నెంబర్ వాడే వాడని.. తాను మాత్రం 7777 నంబర్ వాడే వాడనని నాని స్పష్టం చేశారు. కేశినేని చిన్ని కావాలని తన కార్లకు ఎంపీ స్టిక్కర్లు వేయించుకొని.. రియల్ ఎస్టేట్ దందాలకు తన పేరు వాడుకున్నాడని అన్నారు. ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులు అయితే.. ప్రజలకు సమస్యలు తీర్చడం కాదు కదా కొత్తగా సమస్యలు తెస్తారని ఘాటుగా విమర్శించారు.













