అక్రమాలు బయపటపడుతున్నాయనే… ఆయన పార్టీ మారారు
వైసీపీకి వెళ్లిన కేశినేని నానిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేశినేని శివనాథ్ (చిన్ని) తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయ మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో విజయవాడ ఎంపీ సీటు ఇంకా ఖరారు కాలేదు. చంద్రబాబుని విమర్శించే వారిని ముందు ప్రోత్సహించి, తర్వాత సీటు ఎగ్గొట్టడం జగన్ నైజం అన్నారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో చూడాలి. విజయవాడ పశ్చిమలో తెలుగుదేశం టిక్కెట్లు ఇప్తిస్తానని కేశినేని నాని ఇద్దరి వద్ద డబ్బులు వసూలు చేశారు. ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేశారో త్వరలోనే అన్ని ఆధారాలు బయటపెడతాం. నానికి డబ్చులిచ్చి మోసపోయిన వారు త్వరలోనే మీడియా ముందుకు వస్తారు. అక్రమాలు బయపటపడుతున్నాయనే ఆయన పార్టీ మారారు. మరో 2 నెలల్లో కేశినేని నాని ప్రజా జీవితానికి దూరం కావటం ఖాయం అని అన్నారు.













