అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా… లేదంటే శపిస్తా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా, లేదంటే శపిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సీఎంను కలిసేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అనుమతిలేదని కార్యాలయంలోకి వెళ్లేందుకు పోలీసులు అంగీకరించలేదు. కొంత సేపు ఎదురుచూసిన కేఏ పాల్ అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని చెప్పేందుకే వచ్చానని తెలిపారు. మంగళ, బుధవారం విజయవాడలోనే ఉండి వేచి చూస్తానన్నారు. కలిసేందుకు అనుమతి ఇవ్వకపోతే జగన్ కూడా మాజీ జీఎం అవుతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారో, 75 సీట్లు గెలుస్తారో, 25 సీట్లు గెలుస్తారో తనకు తెలియదన్నారు. ఎంతోమంది దేశాధినేతలు, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం అడగ్గానే అపాయింట్మెంట్ ఇచ్చారని తెలిపారు.













