చంద్రబాబును కలిసిన సుప్రీంకోర్టు న్యాయవాది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును రాజమహేంద్రవరం జైలులో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కలిశారు. ఏసీబీ కోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు తరపున లూథ్రా న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కోర్టులో ఇవాళ జరిగిన పరిణామాలు, తదుపరి కార్యాచరణను లూథ్రా చంద్రబాబు వివరించినట్టు తెలిసింది. మరోవైపు సిద్ధార్థ లూథ్రా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అన్ని ప్రయత్నాలు చేసినా, న్యాయం కనుచూపుమేర లేకుంటే ఇక కత్తిపట్టడమే. పోరాటానికి ఇదే సరైన విధానం అంటూ గురుగోవింద్ సింగ్ సూక్తులు ప్రస్తావిస్తూ లూథ్రా ట్వీట్ చేశారు.













