జనసేన స్టార్ క్యాంపెయినర్లు వీరే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల తరపున ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, క్రికెటర్ అంబటి రాయుడు, నృత్య దర్శకుడు జానీ మాస్టర్, సినీ నటులు సాగర్, పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శ్రీనులను ప్రచారకర్తలుగా నియమించారు. టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు.













