జగన్ అన్న ‘సిద్ధం’ చివరి సభ ఈనాడే..
ఈ రోజు బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ ‘సిద్ధం’ అఖరి సభ జరగనుంది. ఈ సభకు భారీ సంఖ్యలో జనాలు తరలివస్తారు అని వైసీపీ నేతలు చెబుతున్నారు.. ఈ మేరకు సభకు సంబంధించి భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తమ ఐదేళ్ల పాలనలో ప్రజలకు చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలు అన్నిటి గురించి ఈరోజు ఈ వేదిక పైనుంచి జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది అని టాక్. 2024 జరగబోయే ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని కీలక అంశాలను కూడా ముఖ్యమంత్రి ఈ సభ నుంచి ఆవిష్కరించి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపబోతున్నారు. ఈ సభను థింక్ ట్యాంక్ టెలివిజన్, సోషల్ మీడియా ప్లాట్ఫాములపై ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. అంతేకాదు అద్దంకి అంత ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేసి ఈవెంట్‌ను కోటి మందికి పైదా ప్రజలు చూసే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ అంతిమ సిద్ధం సభకు 15 లక్షల మందికి పైగా తరలివస్తారు అని అంచనా. మొత్తానికి ఈ సభతో తిరిగి తమను ఎందుకు ఎన్నుకోవాలి అన్న విషయాన్ని ప్రజలకు వివరించే విధంగా వైసిపి ప్లానింగ్ చేస్తుంది.













