టెస్లాను ఏపీకి రప్పించగలదా..?
ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్యుత్ వాహనాల ఉపయోగం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ అయిన టెస్లాను వైసిపి ప్రభుత్వం ఆంధ్రకు రప్పించడానికి సిద్ధపడుతోంది. ఏపీలో టెస్లాకు సంబంధించిన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనాలను పంపింది. ఇప్పటికే వీటికి సంబంధించి రెండు అధికారిక ఈమెయిల్ లను పంపించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక్కడకు వచ్చి తమ కంపెనీ స్థాపించడానికి అవసరమైన భూములను పరిశీలించుకోవాల్సిందిగా కూడా సూచించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని కియా ప్లాంట్ సమీపంలో కావలసినంత భూమి అందుబాటులో ఉందని వారు స్పష్టం చేశారు.. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి చెన్నై, కృష్ణపట్నం పోర్ట్ అతి సమీపంలో ఉండడం వల్ల ఆ స్థలాన్ని సూచించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు టెస్లా ఏపీకి వస్తే ప్రైవేట్ భూములనైనా కొనుగోలు చేసి అందింపడానికి సిద్ధంగా తమ ప్రభుత్వం ఉందని తెలియజేశారు.













