4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ క్లారిటీ ఇచ్చిన జగన్..
ఆంధ్రాలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.ఎట్టకేలకు ఈ ఉత్కంఠతకు కు ఈనాడు సీఎం జగన్ తెరదించారు. మరొక నాలుగు రోజులలోనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుంది అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. మేదర మెట్టలో జరిగిన ఆఖరి సిద్ధం సభలో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ గురించి విమర్శల వర్షం కురిపించారు. అబద్దాలకు రంగు పూసే ఎల్లో మీడియా తన దగ్గర లేదని.. పార్టీల పొత్తులతో.. జనాలను పోగేసుకొని బాబు పోటీలకు దిగుతున్నాడని.. తను మాత్రం ప్రజలే బలం అనుకొని తలపడడానికి సిద్ధపడుతున్నానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మూడు పార్టీల కూటమితో ముందుకు అడుగు వేస్తున్న చంద్రబాబు పార్టీలో సైన్యాధిపతులే ఉన్నారు తప్ప సైన్యం లేదు అని జగన్ సెటైర్ వేశారు. అటువైపు ఉన్న పార్టీకి నోటా కి వచ్చినన్ని ఓట్లు కూడా వచ్చే అవకాశం లేదు అని ఆయన అన్నారు. జగన్ జోరు చూస్తే ఈసారి కూడా తామే గెలుస్తాము అన్న ధీమా గట్టిగా కనిపిస్తోంది.













