పోలవరం పనులను పరిశీలించిన మంత్రి…
ఒకటొకటిగా వచ్చిపడుతున్న అనూహ్య ఇబ్బందుల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వైఎస్ జగన్ ప్రభుత్వానికి కఠిన పరీక్షగా మారింది. ఈ నేపధ్యంలో… రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రాజెక్టు పనులను బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణానికి కీలకమైన పునరావాస పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. పునరావాస చర్యల్లో భాగంగా 6115 ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని రానున్న వైఎస్ఆర్ జన్మదినం సందర్భంగా వచ్చే జులై నెలకల్లా 10వేల గృహాలు ప్రారంభానికి సిద్ధం కావాలని ఆయన ఆదేశించారు. మరోవైపు ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, స్పిల్ వే తవ్వకం, కాంక్రీట్ పనులను జులై 15 కల్లా పూర్తి చేసేందుకు వీలుగా యంత్ర సామాగ్రి, కార్మికుల తరలింపు ప్రక్రియ చేపట్టాలన్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెల వరకూ చేయాల్సిన పనుల జాబితాను సిద్ధం చేసి అధికారులను సమాయత్తపరిచారు.













