హిందూపురంలో వైసీపీ వర్గ పోరు బాలయ్యకు హ్యాట్రిక్ తెచ్చేనా?
నందమూరి బాలకృష్ణ.. ముచ్చటగా మూడవసారి కూడా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచేది తానే అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మరి అక్కడ వాళ్లకు ఉన్న రికార్డ్ అలాంటిది. హిందూపురం నియోజకవర్గం నుంచి నందమూరి తారక రామారావు గారు 1985 ,89 ,94.. ఇలా వరుసగా మూడుసార్లు గెలిచారు. ఆయన మరణించిన తర్వాత అదే సీటు కోసం జరిగిన ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ గెలుపొందారు. 2014లో తొలిసారి ఈ స్థానం నుంచి నందమూరి బాలకృష్ణ బరిలోకి దిగి 16 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 జగన్ వేవ్ తో టిడిపి అతలాకుతులమైనా.. బాలయ్య మెజారిటీ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇప్పుడు 2024లో హిందూపురంలో వైసీపీ అంతర్గత కలహాలతో బలహీన పడుతుంది. 9 సార్లు హిందూపురంలో జరిగిన ఎన్నికల్లో టిడిపి విజయ బావుటా ఎగురవేసింది. ఈసారి గట్టి పోటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన దీపకను అభ్యర్థిగా జగన్ అన్న నిలబెట్టాడు. అయితే ఆమె పట్ల వ్యతిరేకంగా ఉన్న వైసీపీ నేతల వైఖరి పార్టీకి కలిసి వచ్చేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ వర్గ పోరు బాలయ్యకు మరింత ఫెచ్చింగ్ అవుతుందని టాక్.













