సీఎం జగన్తో కొరియా భారత రాయబారి భేటీ
కొరియాలో భారత రాయబారి శ్రీప్రియ రంగనాథన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో రంగనాథన్ ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలసుకుని పలు అంశాలపై చర్చించారు. రాజధాని అమరావతి స్థితిగతులు, అభివృద్ధి వికేంద్రీకరణ, పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.








