Amaravati :అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్లు విడుదల : మంత్రి నారాయణ
రాజధాని అమరావతి(Amaravati) నిర్మాణానికి రూ.11 వేల కోట్లు విడుదల చేసేందుకు హడ్కో(Hudco) నిర్ణయం తీసుకుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ(Narayana) వెల్లడిరచారు. ముంబయి (Mumbai)లో జరిగిన సమావేశంలో నిధుల విడుదలకు హడ్కో బోర్డు అనుమతి లభించిందని మంత్రి తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం హడ్కో ద్వారా రూ.11 వేల కోట్ల రుణం కోసం సంప్రదింపులు జరిపామని తెలిపారు. నిధుల విడుదలకు హడ్కో నిర్ణయం తీసుకోవడంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.













