ఆ కుటుంబాలకు రూ.కోటి పరిహారం : హోంమంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా పరవాడలోని సినర్జిన్ కంపెనీ బాధితులకు పరిహారం ఇస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తున్నట్లు చెప్పారు. అచ్యుతాపురం సెజ్, పరవాడ సినర్జిన్ కంపెనీ ఈ రెండు ప్రమాదాల్లోనూ బాధితులను ఆదుకున్నది కూటమి ప్రభుత్వమేనన్నారు. కార్మికుల కుటుంబాలను అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే సీఎం చంద్రబాబు విశాఖ వచ్చి బాధితులకు భరోసా కల్పించారని గుర్తు చేశారు. రెండు ఘటనలపై హోంమంత్రిగా తాను ఇక్కడే ఉండి పర్యవేక్షించానని అనిత తెలిపారు.













