స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆదేశించింది. ఎస్ఈసీని ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారుల బృందం కలవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. కరోనా పరిస్థితులపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు తెలిపింది. అధికారుల బృందం ఎస్ఈసీతో చర్చించిన అంశాలను తెలపాలని, దీనికి సంబంధించి ఈ నెల 29న తుది నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం వెల్లడించింది.













