పుట్టినరోజు వద్దంటూ…జయంతిగా మార్చేశారు
కేరళలోనే కాకుండా, ఇటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరదల ప్రభావంతో ప్రజలు అల్లాడుతున్నందున, తన పుట్టిన రోజు సందర్భంగా ఫెక్సీలు, బొకేలు వంటి వాటికి అనవసరంగా ధనాన్ని వృధా చేయవద్దని నందమూరి హరికృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన తన స్వహస్తాలతో ఒక లేఖ రాసి అభిమానులకు పంపించారు. కానీ ఇప్పుడు హరికృష్ణ పుట్టినరోజు జయంతిగా మారడం ఆయన అభిమానులకే కాకుండా, రాజకీయంగా కానీ, వ్యక్తిగతం కానీ ఆయన్ను తీవ్రంగా విబేధించేవాళ్లుకు కూడా తీరని ఆవేదన కలిగిస్తోంది. మరో నాలుగు రోజుల్లో పుట్టినరోజు జరుపుకోవాల్సిన ఆయన అనంతలోకాలకు తరలిపోవడం అత్యంత బాధాకరం.













