మంత్రివర్గం నుంచి గుమ్మనూర్ బర్తరఫ్
తెలుగుదేశం పార్టీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరామ్‌పై వైసీపీ అధిష్ఠానం వేటు వేసింది. వైసీపీ అధినేత, సీఎం జగన్ సిఫార్సు మేరకు జయరామ్‌ను మంత్రివర్గం నుంచి గవర్నర్ బర్తరఫ్ చేశారు. మంగళగిరిలో జరిగిన టీడీపీ, జనసేన సభలో ఆయన టీడీపీలో చేరారు. ఈనెల 4న విజయవాడ కేంద్రంగా ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి, తాను పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడిరచారు. టీడీపీలో చేరిన వెంటనే మంత్రి వర్గం నుంచి జయరామ్‌ను బర్తరఫ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో జయరామ్‌ను కర్నూలు ఎంపీగా పోటీ చేయూలని అధిష్ఠానం ఆదేశించింది. అందుకు ఆయన అసంతృప్తికి గురై కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్నారు. టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లి, ఆయన పోటీ చేసే నియోజకవర్గంపై స్పష్టత వచ్చాక పార్టీ వీడారు.













