Amaravati : వారి డిమాండ్లను సీఎం దృష్టికి : శ్రావణ్‌కుమార్
రాజధాని అమరావతి (Amaravati) కోసం రెండో విడత భూ సమీకరణకు అధికారులు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. తాడికొండ మండల పరిధిలోని పాములపాడు, భేజాత్పురం, రావెల గ్రామాల్లో సభలు నిర్వహించిన ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆయా గ్రామసభల్లో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ (Shravan Kumar), గుంటూరు ఆర్డీవో శ్రీనివాస్ (RDO Srinivas) పాల్గొన్నారు. రాజధాని భూ సమీకరణకు రైతులు అంగీకారం తెలుపుతూనే తమ డిమాండ్లను అధికారుల ముందుంచారు. భూ సమీకరణతో తాము కూడా రాజధాని ప్రాంతంలో చేరతామని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ (Sravan Kumar) మాట్లాడుతూ రెండో విడత భూ సమీకరణకు రైతుల సానుకూలంగా ఉన్నారన్నారు. వారి డిమాండ్లను సీఎం (CM) దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు.













