గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా పంచుమర్తి, జూపూడి?
గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు టిడిపి నాయకత్వం సిద్ధమవుతుంది. మాల వర్గానికి చెందిన జూపూడి ప్రభాకర్ (ప్రకాశం), బీసీ వర్గానికి చెందిన పంచుమర్తి అనూరాధ(కృష్ణా) పేర్లు ఖరారయినట్లు సమాచారం. బీసీ వర్గానికి చెందిన పంచుమర్తి అనూరాధ పేరును పరిగణనలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అనూరాధ, జూపూడి పేర్లు గతంలో జరిగిన ఎన్నికల సమయంలోనే ఖరారయ్యాయి. జూపూడి పేరు ప్రకటించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఆయనకు ఎమ్మెల్సీ దక్కలేదు. దానితో ఈసారి అవకావం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక చేనేత వర్గానికి చెందిన అనూరాధకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినా, తాత్కాలికం అన్న కారణంతో ఆమె దానిని నిరాకరించటంతో నాయకత్వం ఆమెను కొంతకాలం దూరంలో పెట్టింది. మళ్లీ బాబు వద్దకు వెళ్లి క్షమాపణ అడగడంతో తిరిగి ఆమెకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం అనూరాధ మహిళా పైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా వ్వవహరిస్తుండగా, జూపూడీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు.













